Verse
ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృపవెంబడి కృపను
Verse
ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు
Verse
జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచి
సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
నీదుస్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
దేవా నీ ప్రజల యెడల - దినదినము నీకున్న
ఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము
Verse
కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూప
హల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక