Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Nee Paripoornatha Nundi

ప్రభువా నీ పరిపూర్ణత నుండి

Prabhuvaa Nee Paripoornatha Nundi

Lyricist: Songs Of Zion
Verse
ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను
Verse
ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు‖ ప్రభువా ‖
Verse
జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము‖ ప్రభువా ‖
Verse
నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము‖ ప్రభువా ‖
Verse
దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము‖ ప్రభువా ‖
Verse
మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము‖ ప్రభువా ‖
Verse
ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము‖ ప్రభువా ‖
Verse
కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక‖ ప్రభువా ‖

Related Tags

GracePrayerBlessing