Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Nee Samukhamandhu

ప్రభువా నీ సముఖము నందు

Prabhuvaa Nee Samukhamandhu

Lyricist: Bro Yesanna
Verse
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
Verse
పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే‖ 2x ‖
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి‖ 2x ‖
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి‖ ప్రభువా ‖
Verse
సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను‖ 2x ‖
ఆదరణ కర్తచే - ఆదరించి‖ 2x ‖
నీ నిత్య కృపలో - భద్రపరచి‖ ప్రభువా ‖
Verse
సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో‖ 2x ‖
ఆనందమానంద - మానందమాని‖ 2x ‖
ప్రియునితో నేను పాడెదను‖ ప్రభువా ‖

Related Tags

WorshipJoyConfession