Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Needhu Ghananaamamun Maemu

ప్రభువా నీదు ఘననామమున్ మేము

Prabhuvaa Needhu Ghananaamamun Maemu

Chorus
ప్రభువా నీదు ఘననామమున్ మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనే - యేసు
ప్రియుడా నీ పాద సన్నిధి చేర
నాలో నీదు ప్రేమ అధికంబాయనే
Verse
ఇహ పరము పొగడునట్టి ఘననామమే
ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే
శ్రమలన్ని బాపునట్టి ఘననామమే
భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే
Verse
కీడునంత తొలగించు ఘననామమే
వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
Verse
అపవాదిని తరిమినట్టి ఘననామమే
మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే
పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే
పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే

Related Tags

PraiseWorshipJesus