Verse 1
Reference: మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు 1 థెస్స Thessalonians 5:24
Chorus
ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ
Verse
ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు
మహిమ పరతురు దేవుని
అంగీకరించు ప్రతివానిజిహ్వ నీవే క్రీస్తువనుచు
Verse
అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు
ప్రేమగల ప్రభువా
పాపిని రక్షింప యిహమున కరిగి గొప్పరక్షణనిచ్చె
Verse
ఐగుప్తునుండి విడిపించిన వారిని నలువది వత్సరములు
నడిపించితివి కాచితివి కనుపాపగ
వుంచియున్నావు మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది
Verse
పరమును తెరచి మన్నా కురిపించి అందరికి జీవజలమిచ్చితివి
పొందిరి తృప్తి నీయందు
అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును
Verse
తుఫానురేగి నిరాశపరచ శత్రువు మామధ్య చెలరేగగ
మమ్ములను రక్షించితివి
వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిచ్చితివి