Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Neeve Naadu Sharanam

ప్రభువా నీవే నాదు శరణం

Prabhuvaa Neeve Naadu Sharanam

Lyricist: Lankapalli Samuel John
Verse
ప్రభువా నీవే నాదు శరణం
ఆశ్రయించితి నీ చరణములే‖ 2x ‖
అపవాది క్రియలందు బంధీనైతిన్
కృప చూపి నను విముక్తుని చేయుమా
విపరీతి గతి పొందియుంటిన్
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము‖ ప్రభువా ‖
Verse
మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము
చెదరిన నీదు ప్రతి రూపం
నాపై సరి చేసి ముద్రించు దేవా
Verse
నీ న్యాయ విధులన్ని భంగ పరచి
గాయపరచితి నేను అపరాధిని
పరితాపమును పొందుచుంటి
నాదు పాపము క్షమియించు దేవా‖ ప్రభువా ‖
Verse
పాప భారము తొడ అరుదించితి
సేద తీర్చుము శాంతి జలములతో
నీ ప్రేమ రుధిర శ్రవంతి
శాప భారము తొలగించు దేవా‖ ప్రభువా ‖
Outro
శరణం యేసు చరణం‖ 4x ప్రభువా ‖

Related Tags

WorshipPrayerRepentance