Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Ninnaaraadhimpanu Jerithima

ప్రభువా నిన్నారాధింపను జేరితిమ

Prabhuvaa Ninnaaraadhimpanu Jerithima

Lyricist: Molathati Vidyanandamu
Chorus
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా
దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో
సత్యంబుతోడను‖ ప్రభువా ‖
Verse
ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా
దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి
యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను
భజింతుము‖ ప్రభువా ‖
Verse
అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో
దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద
లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను
బనిచి తుదకుఁ బ్రసన్నమగుము‖ ప్రభువా ‖
Verse
పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో
దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా
దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని
చేయ నడుపుము‖ ప్రభువా ‖

Related Tags

WorshipMorning Prayer