Chorus
ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి
Verse
గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు
నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు
Verse
యేసయ్య పలికితివి - ఆ సముద్ర పొంగులలో
నిశ్శబ్దముగా యూర - కొండుము నిమ్మళముగా
Verse
భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి
Verse
తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి
Verse
ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యతిగాను
Verse
అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల
Verse
సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా