Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Prabhuvaa

ప్రభువా ప్రభువా

Prabhuvaa Prabhuvaa

Verse
ప్రభువా ప్రభువా
కడలిని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్‖ ప్రభువా ‖
Verse
ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్‖ ప్రభువా ‖
Verse
దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్‖ ప్రభువా ‖

Related Tags

PrayerHopeSuffering