Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaina Kreesthu Mahimaswarupa Poojinthumu Nin

ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

Prabhuvaina Kreesthu Mahimaswarupa Poojinthumu Nin

Verse
ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్
Verse
సార్వత్రిక సంఘ నగర విహారీ సర్వస్వానీ కాధారీ
పరిశుద్ధ మహాసభల ప్రధానీ భక్తస్తుతి హారాధారీ
Verse
భక్తుండగు మోషే నీదు ఆనతిని నిర్మించె గుడారమున్
దానిన్ నీదు మహిమతో నింపి ధగధగ మెరిపించిన ప్రభో
Verse
రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి రమ్యంబుగా శిష్యుల
హృదయ సుమముల్ విరియబూయన్ సదయా ప్రకాశించితివి
Verse
దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ నెరవేర్చితివి పూర్తిగా
ధీరుడవై నీ ప్రాణం నొసగి తండ్రిని మహిమపరచితివి
Verse
మంటి పురుగులమౌ మమ్ము రక్షించి మా నీతిమహిమ నీవై
మాలో నీవు మహిమరూప మహిమ పరచబడినావు
Verse
మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ మాదు కృతజ్ఞతలు
మాప్రాణాత్మల్ మాదుతనువుల్ మాప్రభు నీస్వంతం నిరతం

Related Tags

PraiseWorshipGlory