Chorus
ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు
అభయులై నిరపరాధులై యుందురు
Verse
అంతము వరకు స్థిరపరచు నాయనే
ఎంతైన నమ్మదగియున్న వాడు
స్తుతికి పాత్రుండు
Verse
శోధనలచే క్రుంగియున్న మీకు
బాధలలో శాంతిని యిచ్చువాడు
ఓదార్చువాడు
Verse
గత జీవితములో తప్పిపోతి రెంతో
మితిలేని దేవుని వాత్సల్యత
ఎప్పుడు తప్పిపోదు
Verse
అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి
దేవుని కనికరమెంతో గొప్పది
విడిచి పోనిది
Verse
మీ జీవితములలో వాగ్దానములను
సజీవమౌ విశ్వాసము పొంది
చేపట్టుకొనుడి