Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvu Dhigivachchunu Paramunumdi Vaegamae Vibhudu Thirigivachchunu Parama Vadhuvukai

ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై

Prabhuvu Dhigivachchunu Paramunumdi Vaegamae Vibhudu Thirigivachchunu Parama Vadhuvukai

Chorus
ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే
విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై
Verse
ప్రభువు దిగివచ్చు నార్భటముతో - దూత శబ్దముతో బూరధ్వనితో
క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు
వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా?
Verse
వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చును
తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా
సిగ్గుతో భయముతో నుందువా దినమునా?
Verse
హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడి
శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ
ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి
Verse
అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను
తనకొరకై వేచియుండు వారికొరకు
పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ
Verse
ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో
నిద్దుర పోవుచునుండగా వచ్చునో
మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు

Related Tags

Second ComingRaptureJesus Return