Verse
ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము
Verse
వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
గురునికి వారలు జనులుగా నుండెదరు
Verse
మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
తన భక్తులకు రక్షణ సమీప మాయెను
Verse
కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి
Verse
భూలోకము లోనుండి సత్యము మొలుచు
నాకాశములోనుండి నీతి పారజూచును
Verse
దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును
Verse
ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
ఆయన అడుగు జాడలలో మేము నడతుము