Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvugan Prathishtimparae Gruhamu

ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహము

Prabhuvugan Prathishtimparae Gruhamu

Lyricist: Si Vijaya Charles
Chorus
ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా ప్రతిష్టింపరె
విభవమొందగ నతని శుభమౌ నామము ధర సౌ రభమును వెదజల్లగ
ప్రబలమౌ ప్రేమన్ ప్రభుని యెడ గనపర్చరె‖ ప్రభువు ‖
Verse
పూర్ణ ప్రేమను జూపరే గృహమున క్రీస్తును పూర్ణ ప్రేమను జూపరే
పూర్ణ హృదయముతోను పూర్ణయాత్మతో మరి ప్ర పూర్ణ శక్తితో జూపరే
క్రీస్తునిలో సం పూర్ణులగుటకు సాగరె‖ ప్రభువు ‖
Verse
భక్తితోడను గొల్వరే గృహమున క్రీస్తున్ భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు
తన స్వ రక్తమీయను మనకై రిక్తుడాయెను జూడరే ముక్తిదాతను నా
సక్తితో గొనియాడరే‖ ప్రభువు ‖
Verse
నమ్మకస్థులై యుండరే గృహమున క్రీస్తుకు నమ్మకస్థులై యుండరే
అమ్మహాత్ముని నామ మిమ్మహిన్ దగజాటన్ నమ్మె మిమ్మును జూడరె
సమ్మతిన్ గ్రీస్తున్ నమ్మకంబుగ జాటరె‖ ప్రభువు ‖

Related Tags

WorshipDedicationHome