Verse
ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి
తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి
Verse
ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను‖ 2x ‖
హానోకు దేవునితో కూడ నడువగా - 2 తనతో నతనిని కొనిపోయెను‖ 2x ‖
Verse
నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై
తనతరములో నీతిమంతునిగా నెంచి - జలప్రళయమునుండి కాపాడెను
Verse
అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా
దేవుడతనితో, నిబంధనను చేసి - తన స్నేహితుడని ప్రకటించెను
Verse
దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే
దేవుని యింటిలో నమ్మకమైన - వాడని ప్రభువే పలికెనుగా
Verse
దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు
స్థిరపరచెనాతని సింహాసనమును - తన చిత్తానుసారుడని పలికెన్
Verse
పేతురు, యాకోవు, యోహానులు - ప్రభువును వెంబడించిరి
పరలోక సంఘ దర్శనమునిచ్చి - మనుజులను పట్టువారిగా చేసెన్
Verse
పునరుత్థానుడైన ప్రభువును గానక - ఎమ్మాయి కెళ్ళిరి శిష్యులు
యేసే వారితో కూడ నడిచెన్ - గద్దించి వారి కళ్ళు తెరిపించెను
Verse
వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో
అర్హులై తెల్లని వస్త్రము ధరించి - సంచరింతురు ప్రభుతో
Verse
యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా
మన అతిక్రమములను ఒప్పుకొనెదము - యేసుతో కలిసి కొనసాగెదం