Verse
ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా
పదిలముగా జీవించవా?
Verse
ఆదామవ్వలవలె నీవు సహ
కేవలము దిగంబరివైయుండ
ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో
పావన వస్త్రముల నిచ్చెను
Verse
శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు
సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె
అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా
హతసాక్షిగా నీ వుండెదవా?
Verse
ప్రభు యడుగుజాడలను పరికించి
ప్రభు కనుకూలంబుగా నడచినచో
హానోకువలె ఆ రెండవ మరణము
నొందక ప్రభుతో నుండెదవు
Verse
పరిశుద్ధమైన ప్రవర్తనలో
ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి
నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి
ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్
Verse
మృతులను సహలేపు మహాత్మ్యుడని
తన సుతునర్పించె నబ్రాహాము
మృతికి లోనగు నీ శరీరంబును
అతనికె బలిగా నర్పించు
Verse
తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు
మౌనమున్ జూపి మరణము గోరె
కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము
ముంగిట నీవట్లుండెదవా?
Verse
యెహోవా భయము నొంది యోసేపు
ఎంత వైభవ మనుభవించెనో గాంచు
నీ జీవితంబులో దైవ భయము నొంది
అక్షయ కిరీటమున్ బొందు