Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuyaesu Naakai Sarvamu Nichchithivi Praemanubatti Arpimchu Komtivi Naakai

ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై

Prabhuyaesu Naakai Sarvamu Nichchithivi Praemanubatti Arpimchu Komtivi Naakai

Verse
ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
Verse
శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ
Verse
కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి
Verse
కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను
శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా
Verse
కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి
Verse
ప్రాయశ్చింత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు
పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను
Verse
ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి
Verse
నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి

Related Tags

WorshipSalvationSacrifice