Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuyaesu Prabhuyaesu Adhigo Shrama Nondhenu Khaidheelanu Vidipimchenu Siluvaloa

ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో

Prabhuyaesu Prabhuyaesu Adhigo Shrama Nondhenu Khaidheelanu Vidipimchenu Siluvaloa

Verse
ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో
Verse
ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీద కెత్తిరి
బాధనొందియు - ఎదురు మాటలాడక
Verse
ముండ్ల మకుటము - తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన మోక్షద్వారము తెరచి
Verse
ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము - గడగడ వణికెను
Verse
మరణించెను - సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను మరణ బంధితులను
Verse
తీసివేసెను - నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవునిదయ - కుమ్మరించబడెను
Verse
కారు చీకటిలో దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు వేరెవ్వరు నెరుగరు

Related Tags

Good FridaySufferingCrucifixion