Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuyaesu Rammanuchumde Paapula Nellarini

ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని

Prabhuyaesu Rammanuchumde Paapula Nellarini

Verse
ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని
వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు
Verse
లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి
దేవుని మహిమకు దూరమైపోయిరి
మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే
Verse
ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు
మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై
మరణము గ్లెచి విజయమునిచ్చి - నీతిగా తీర్చె
Verse
ఎందరు విశ్వసింతురో ప్రభువైన యేసుని
వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ
నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము
Verse
పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు
ఎవరి పాపదోషములు - పరిహరింపబడునో
వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా
Verse
పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారెగా
తీర్పు మరణము లేక జీవము పొందెదరు
పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో

Related Tags

InvitationGospelSalvation