Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuyaesu Sanghamu Nirmimchuchunda Garvisaathaanu Jayamondha Laedu

ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ గర్విసాతాను జయమొంద లేడు

Prabhuyaesu Sanghamu Nirmimchuchunda Garvisaathaanu Jayamondha Laedu

Verse
ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ
గర్విసాతాను జయమొంద లేడు
Verse
పరలోకమాదిరి నిర్మించుచుండె
నరుని ఆలోచన జరిగింప
డిందు - స్థిరపునాదిపై నిర్మించుచుండె
పరిపూర్ణతను విరివిగా నింపున్
Verse
ఆదాముతో కూడ నడిచిన దేవుడు
గుడారమున వసియించినాడు
సొలొమోనాలయము నింపినాడు
కాలమెల్ల తనయునిలో వసించున్
Verse
క్రీస్తు ప్రభు దాని స్థిరపునాది
ఇసుక పై వేసిన నశియించునంత
సజీవుడగు యేసు నిజ మూలరాయి
సజీవరాళ్ళను విజయుడు జేర్చున్
Verse
నిత్య దేవుని నిజ ఆత్మజులారా
ఆత్మీయంబగు ఆలయము మీరే
ఆత్మ ఐక్యమును అనుసరించుడి
హస్తకృతంబులు ఆలయమగునా?
Verse
యూదుడని మరి హెల్లేనీయుడని
లేదు జాతుల భేదము లేమి
లేదు దాసుడు స్వతంత్రుడని
భేదముండదు స్త్రీ పురుషులని
Verse
ఏ నామమున లేనిది సంఘము
నామమిచ్చిన యెన్నదగు కీడు
కనబడు కట్టడములు కలిపి పోల్తుమా
కనివిడిచెదము పొరబాటులను
Verse
ప్రకటించెదము ప్రాకటముగను
ఏక మనస్సుతో ఏక శరీరమని
సకల కాలము శక్తితో నిలిచి
పొగడుచు శిరస్సును పాడెద మిపుడె

Related Tags

FaithJesusChurch