Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuyesu Naakai

ప్రభుయేసు నాకై

Prabhuyesu Naakai

Verse
Prabhu Yesu Naa Kai
ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
Verse
శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై
స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా
సహించితివి ప్రేమతోడ
Verse
కాళ్ళు చేతులలో మేకులు కొట్టిరి
బల్లెముతో ప్రకన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను
ఓర్చితివా మౌనము వహించి
Verse
ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమా
ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే
పొందుగ నీ వాడనైతి

Related Tags

WorshipSacrificeLove