Verse
ప్రభుని స్తుతింప పరుగిడి రావా
ప్రణుతింపగను ప్రేమతో రావా
ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమున్
Verse
సంగీతముతోను స్తుతి గానముతోను
సన్నుతి చేయను సర్వోన్నతుని సంతసమున రావా
Verse
తంబుర వీణతోను సితార నాదముతో
కొనియాడను మన స్వామి యేసును సాగిలపడి రావా