Verse
ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే
Verse
ప్రతివాడు మోక్షము జేర - ప్రభుయేసు వార్తను వినరే
Verse
పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరి
ప్రభు యేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి
Verse
యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్
యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ
Verse
పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్
Verse
ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారా
ప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి
Verse
యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారే
దోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి