Chorus
ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె
Verse
పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి
ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి‖ ప్రజ ‖
Verse
ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్
యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ‖ ప్రజ ‖
Verse
పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్‖ ప్రజ ‖
Verse
ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా
ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి‖ ప్రజ ‖
Verse
యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే
దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి‖ ప్రజ ‖