Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prakashamaina Aashcharyadeshamu Priyuni Deshamu Naa Priya Deshamu

ప్రకాశమైన ఆశ్చర్యదేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము

Prakashamaina Aashcharyadeshamu Priyuni Deshamu Naa Priya Deshamu

Chorus
ప్రకాశమైన ఆశ్చర్యదేశము
ప్రియుని దేశము నా ప్రియ దేశము
Verse
పాపరహిత దేశము ఏ శాపము కనబడదు
నిత్యానందము ఆగని గీతము
ఆకాశమందు హోసన్నా హల్లెలూయ
Verse
సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు
దైవకుమారుడు తేజోమయుడు
నిత్యము వెలుగిచ్చును పగలెప్పుడు
Verse
పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు
యేక కుటుంబము ఒక నాయకుడే
ప్రేమామయ దేశము ప్రియులు వెళ్ళు
Verse
ప్రశ్నలు యేవుండవు ఎట్టి కలవరమే వుండదు
జాతి రంగు భాష భేదము
కలవారెవరు లేరు ప్రేమే పల్కున్
Verse
పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు
చెరసాలలును శిక్షయు లేదు
నరుల పరిపాలన అందుండదు
Verse
సంత వీదులు లేవు కర్మాగారములే లేవు
ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు
అను భేదము లేదు అందరు సమం
Verse
యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు
ఈ గొప్పధన్యత పోగొట్టుకొను వా
రెవరును కావలదు నేడే రమ్ము

Related Tags

HeavenHopeEternity