Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prakasinchenu Oh Divya Thaara

ప్రకాశించెను ఓ దివ్య తార

Prakasinchenu Oh Divya Thaara

Lyricist: Bro P Sunith , Bro Bobby Jeevan
Verse
ప్రకాశించెను ఓ దివ్య తార
క్రీస్తేసు జన్మకై ఆ నింగిలోన
భూలోకమంత సంబ్రమాయెను
పరలోకమంతా పరవసించెను
కన్యమరియ గర్భమందు క్రీస్తు పుట్టినాడని
స్తుతింతును యేసయ్యను
అర్పింతును నా హృదయము
Verse
కోట్లకొలదిగా దేవదూతలు
నిన్ను ఎల్లవేలలా స్తుతించునే
సమీపింపని తేజస్సులో
నివసించు భాగ్యం విడచినావుగ
సర్వశక్తిమంతుడా మానవాళినందరిని
రక్షించుటకే పరమునుండి భువికి
కన్యమరియ గర్భమందు క్రీస్తు పుట్టినాడని
ప్రేమించెను నన్నింతగా జన్మించెను నాకోసమే
స్తుతింతును యేసయ్యను
అర్పింతును నా హృదయము
Verse
ధన్యమాయెను ఈ సర్వలోకము
ఆ పశులపాకలో ప్రభుని జన్మతో
పాపచీకటి పారద్రోలను
విమోచకునిగా అవతరించెగ
నిత్యజీవ మార్గమై నిన్ను నన్ను చేరగా
విశ్వసించు వారిని నిత్య రాజ్యం చేర్చుటకు
కన్యమరియ గర్భమందు క్రీస్తు పుట్టినాడని
ప్రేమించెను నన్నింతగా జన్మించెను నాకోసమే
స్తుతింతును యేసయ్యను
అర్పింతును నా హృదయము

Related Tags

WorshipChristmasNativity