Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prakatinchara Prabhuyesu Vaarthanu

ప్రకటించరా ప్రభుయేసు వార్తను

Prakatinchara Prabhuyesu Vaarthanu

Chorus
ప్రకటించరా ప్రభుయేసు వార్తను
ప్రవచించరా ప్రభుక్రీస్తు రాకను‖ 2x ‖
పరలోక రాజ్యము పరవశించు రాజ్యమనీ
పరిశుధ్ధులు పాలించు ప్రభుయేసుని
రాజ్యమని‖ 2x ‖
Verse
రాయలసీమ రతనాలసీమ కాగ
పల్నాటిసీమ పగడాలనిధిగ మార‖ 2x ‖
కోనసీమ తన కంబురాశి కాగ‖ 2x ‖
దివిసీమ యేసుని హృదయ సీమ కాగ‖ 2x ‖
Verse
జల్లీసీమ జీవజలమయము కాగ
పట్టీసీమ పరలోక మహిమసీమ కాగ‖ 2x ‖
రెడ్డిసీమ రారాజు పీఠము కాగ‖ 2x ‖
ఈశాన్య ఆంధ్రము యేసయ్యది కాగ‖ 2x ‖
Verse
తెలంగాణా పులకరించి పుష్పించను
కోయ బంజారా క్రీస్తేసుచెంతచేర‖ 2x ‖
హైదరా సికింద్రబాదు హోసన్నని పాడ‖ 2x ‖
పట్టణా పల్లెల్లో ప్రేమానందమునిండ‖ 2x ‖
Verse
తెలుగుజాతీ తేజోమయమైనిండ
జయగీతమెత్తి జైజై అని పాడ‖ 2x ‖
మారును మన ఆంధ్రావని స్వర్ణాంధ్రగా‖ 2x ‖
చేరు క్రీస్తు మకుఠమందు మణిపూసగా‖ 2x ‖

Related Tags

Second ComingEvangelismMission