Verse
ప్రకటింతును నీ సువార్తను
సకల జనులకు సహనముతో
సత్య వాక్యము ధ్యానించుచు
సమయమునందు అసమయమునందు‖ 2x ప్రకటింతును ‖
Verse
లోకము నన్ను ద్వేషించినా
లోకులు నన్ను దూషించినా‖ 2x ‖
నా వారు నన్ను నిందించినా
నా ప్రియులే నన్ను విడనాడినా‖ 2x ‖
నిందలు మోపి హింసలు పెట్టినా
ప్రకటింతును నీ సువార్తను‖ 2x ప్రకటింతును ‖
Verse
ఆత్మల రక్షణ కొరకై నేను
అలయక ముందుకు సాగెదను‖ 2x ‖
అంతము వరకు ప్రకటింతును
మరణించి లేచిన ప్రభుయేసును‖ 2x ‖
హత సాక్షులలో చేరుటకైన
ప్రయాసపడెద సువార్తకై‖ 2x ప్రకటింతును ‖
Verse
గురియొద్దకు నేను పరుగెత్తుచూ
తిన్నని మార్గము నే నడిచెద‖ 2x ‖
యేసుని పనులను శ్రద్ధతో చేయుచు
జీవ మకుఠము ఆశించుచూ‖ 2x ‖
జీవ పునరుత్ధానమునే
పొందుటకై నే ప్రకటింతును‖ 2x ప్రకటింతును ‖