Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praneswara Prabhu Daivakumara

ప్రాణేశ్వర ప్రభు దైవకుమార

Praneswara Prabhu Daivakumara

Lyricist: Bro Yesanna
Chorus
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార
Verse
నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె‖ 2x ‖
నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే‖ 2x ‖
॥ ప్రాణేశ్వర ॥‖ ప్రాణేశ్వర ‖
Verse
నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను‖ 2x ‖
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము‖ 2x ‖
॥ ప్రాణేశ్వర ॥‖ ప్రాణేశ్వర ‖
Verse
కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన‖ 2x ‖
కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి‖ 2x ‖
॥ ప్రాణేశ్వర ॥‖ ప్రాణేశ్వర ‖

Related Tags

PraiseWorship