Verse
ప్రార్ధన వినెడి పావనుడా
ప్రార్ధన మాకు నేర్పుమయా
Verse
శ్రేష్ఠమైన భావము గూర్చి శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ
పరలోక ప్రార్ధన నేర్పుమయా
Verse
పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగామోడ్చి శిరమును
వంచి సరిగమ వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా
Verse
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు
ఒంటిగ కొండను చేసిన ప్రార్ధన నేర్పుమయా
Verse
శత్రుమూక నిను చుట్టుకొని సిలువపై నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్ధన నేర్పుమయా