Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prardhana Yesuni Sandarshana Parama Thandritho Sambhashana

ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ

Prardhana Yesuni Sandarshana Parama Thandritho Sambhashana

Verse
ప్రార్ధన యేసుని సందర్శన - పరమ తండ్రితో సంభాషణ
Verse
కరములెత్తి ప్రార్ధించగా - పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా - మధుర స్వరముతొ మాటాడును‖ ప్రార్ధన ‖
Verse
తండ్రి అని నే పిలువగా - తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా - కన్నీరంతయు తుడిచివేయున్‖ ప్రార్ధన ‖
Verse
మోకరించి ప్రార్ధించగా - సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును - మహిమతో నలంకారించును‖ ప్రార్ధన ‖
Verse
కుటుంబముతో ప్రార్ధించగా - కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును - శాశ్వత జీవము అచటుండును‖ ప్రార్ధన ‖
Verse
సంఘముగను ప్రార్ధించగా - కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును - ఆత్మ వరములతో నింపును‖ ప్రార్ధన ‖
Verse
ఉపవాసముతో ప్రార్ధించగా - కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును - క్రొత్త పానము త్రాగించును‖ ప్రార్ధన ‖
Verse
ఏకాంతముగా ప్రార్ధించగా - నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును - యేసు రాజ్యము నను చేర్చును‖ ప్రార్ధన ‖

Related Tags

WorshipPrayerFellowship