Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthana Vinedi Paavanuda

ప్రార్థన వినెడి పావనుడా

Prarthana Vinedi Paavanuda

Chorus
ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా‖ ప్రార్థన ‖
Verse
శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను
ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా‖ ప్రార్థన ‖
Verse
పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి
సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా‖ ప్రార్థన ‖
Verse
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు
దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా‖ ప్రార్థన ‖
Verse
శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో
నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా‖ ప్రార్థన ‖

Related Tags

DevotionalPrayer