Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthana Vinedu Deva Prarthinchumanina Prabhuva

ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా

Prarthana Vinedu Deva Prarthinchumanina Prabhuva

Verse
ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా
స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మముజూడు‖ 2x ‖
Verse
పొందిన మేలుల మరచి మందిర సమృద్దిన్ విడచి
పొందితిమిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా
Verse
ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరులవలె మేము
అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా
Verse
ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మముజూచి
పరిహాసమును చేయ తరుణము నిచ్చితిమయ్యా
Verse
ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా
త్రోసివేయని మా దేవా నీ చెంత జేరితిమయ్యా
Verse
నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు
నింపునీయాత్మనుమాలో సంపూర్ణులుగా జేయుమయ్యా

Related Tags

WorshipPrayerRepentance