Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthinchumu Nee Jeevithamulo Nemmadi Sukhamu Londedavu

ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు

Prarthinchumu Nee Jeevithamulo Nemmadi Sukhamu Londedavu

Chorus
ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు‖ 2x ‖
సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు
Verse
యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా‖ 2x ‖
సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు‖ 2x ‖
నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము‖ 2x ‖
Verse
కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చినను
సాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచినను
భయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును
Verse
ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మని
విశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినా
సాతాను దుర్గములను పడగొట్టి - బలము పొందెదవు
Verse
ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములో
ప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతో
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి
Verse
యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకై
భారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చును
వారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును

Related Tags

FaithPrayerDevotion