Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prathi Roju Choodaalani

ప్రతి రోజు చూడాలని

Prathi Roju Choodaalani

Verse
ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను‖ 2x ‖
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును‖ 2x ప్రతి ‖
Verse
పరలోకమందున పరిశుద్ధ దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను‖ 2x ‖
జీవ జలము యొద్దకు నడిపించును
ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును‖ 2x ప్రతి ‖
Verse
ఆకాశమందున రారాజుగా వచ్చును
భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు‖ 2x ‖
కడబూరధ్వని వినిపించును
పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును‖ 2x ప్రతి ‖

Related Tags

WorshipJesusHope