Verse
ప్రతి ఉదయం నీ కృపను
ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము
రేయంతా ఆరాదించెదము
Chorus
అన్నికాలములలో – స్తోత్రార్హుడని నిన్ను‖ 2x ‖
మేము పాడెదం – మేము పాడెదం‖ 2x ‖
Verse
ఆరంభము నీవే – అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే – అనువాడవు నీవే‖ 2x ‖
నిత్యమూ నివసించూ – దేవుడవని నిన్ను‖ 2x ‖
మేము పాడెదం – మేము పాడెదం‖ 2x ‖
Verse
ఆకాశము నీదే – అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే – జలరాసులు నీవే‖ 2x ‖
సర్వమును సృజించిన – దేవుడవని నిన్ను‖ 2x ‖
మేము పాడెదం – మేము పాడెదం‖ 2x ‖
Verse
నీతిమంతుడు నీవే – నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే – పరిహారము నీవే‖ 2x ‖
మా కొరకు బలియైన – దేవుడవని నిన్ను‖ 2x ‖
మేము పాడెదం – మేము పాడెదం‖ 2x ‖
Verse
సంకల్పము నీదే – ఆలోచన నీదే
రాజ్యములు నీవే – రారాజువు నీవే‖ 2x ‖
సర్వాధికారియైన – దేవుడవని నిన్ను‖ 2x ‖
మేము పాడెదం – మేము పాడెదం‖ 2x ‖