Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pravimaludaa Paavanudaa Sthuthisthothramu Neeke

ప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకే

Pravimaludaa Paavanudaa Sthuthisthothramu Neeke

Verse
ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే
పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు
Verse
నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగా
ఆనంద ప్రవాహ జలమును - మాకు త్రాగనిచ్చితివి
కొనియాడెదము నీ కృపకై ఆనందించుచు పాడెదము
Verse
దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావు
జ్ఞానమునకు మించిన ప్రేమ మాలో బయలు పరచితివి
కృతజ్ఞతలు చెల్లించుచు పూజించెదము నిన్నెప్పుడు
Verse
దైవత్వము నిండియుండెనుగా క్రీస్తు యేసు ప్రభువునందు
ఆయనయందు సంపూర్ణులుగా మమ్ము జేసియున్నావు
సాగిలపడుచు నీ కృపకై ఆరాధింతుము నిన్నిలలో
Verse
నిర్ధోషులుగా నిరపరాధులుగా నీ రక్తముతో మము జేసితివి
సర్వసంపూత్ణత మాకిచ్చి సిలువలో సంధిజేసితివి
నిత్యము నిన్ను స్తుతించి ఘనపరచెదము నిన్నిలలో
Verse
కృపా సత్యసంపూర్ణుడవై మామధ్యలో నివసించితివి
లోకమునందు నమ్మబడితివి అద్వితీయ తనయుడవై
నిరతము నిన్ను కీర్తించి సమాజములో పాడెదము

Related Tags

PraiseWorshipThanksgiving