Verse 1
Reference: ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచ్చున్నాను యోహాను John 15:15
Verse
ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును
క్రీస్తునొద్ద మన భార - మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును
Verse
నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో - వి - శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తిచేత - క్రొత్తగతి జూతురు
Verse
దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు
మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్
జయ మొప్ప నోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును
Verse
ధరణిలో యేసుగాక - వేరుగొప్ప మిత్రుడా!
పరలోకమందు నింక - పరమ రక్షకుడా!
నరులను గావ వేగ - గ్రూరహింస పొందుచు
కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించును