Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preethigala Mana Yesudentho Goppa

ప్రీతిగల మన యేసుఁడెంతో గొప్ప

Preethigala Mana Yesudentho Goppa

Lyricist: Joseph Medlicott Scriven
Verse
ప్రీతిగల మన యేసుఁ
డెంతో గొప్ప మిత్రుఁడు
మితిలేని దయచేత
హత్తుచుఁ బ్రేమించును
క్రీస్తునొద్ద మన భార
మంత నప్పగించినన్
శక్తిగల యేసుచేత
మోఁత లెల్ల వీడును
Verse
నీతిగల మన యేసు
ధృతిగల మిత్రుఁడు
మృతిఁ బొంది కృపతో వి
శ్రాంతి కలిగించెను
భీతి నొందుఁ బాపు లైనఁ
జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత
క్రొత్త గతిఁ జూతురు
Verse
దయగల మన యేసు
ప్రియమైన మిత్రుఁడు
మాయలోకమందు నిజా
శ్రయుఁడై కాపాడును
భయ దుఃఖ శ్రమ లాది
మోయరాని బాధలన్
జయ మొప్ప నేర్పి యేసు
స్థాయి వృద్ధిచేయును.
Verse
ధారుణిలో యేసుగాక
వేరుగొప్ప మిత్రుఁడా?
పరలోకమందు యేసే
వీరుడౌ రక్షకుఁడు
నారకుల! గావ వేగఁ
గ్రూర హింసఁ బొందెను
కరుణించి నిచ్చి ప్రతి
ప్రార్థన నాలించును.

Related Tags

ComfortJesusFriendship