Chorus
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరీ (సోదరా)
కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై‖ 2x ‖
Verse
తల్లిదండ్రులు కలలు కని రెక్కలు ముక్కలు చేసుకొని‖ 2x ‖
రక్తము చెమటగా మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే.. పట్టణం పంపిస్తే.
ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి‖ 2x ‖
కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై‖ 2x ‖
Verse
ప్రభు ప్రేమను వదులుకొని ఈలోక ఆశలు పట్టుకొని‖ 2x ‖
యేసయ్యక్షమను వలదని దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే.. తనువును చాలిస్తే..
నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని‖ 2x ‖
కొన్నతండ్రి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై‖ 2x ‖