Verse
ప్రేమ కలిగి సత్యము పలుకుచు
క్రీస్తువలె సాగుదమా
అందరితోను ప్రతీ విషయములో
క్రీస్తువలె మెలగుదమా
Chorus
క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం
క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం
క్రీస్తు యేసుతో నడచుచూ
క్రీస్తు ప్రేమను చాటెదమా
క్రీస్తు ప్రేమను చాటెదమా‖ 2x ‖
Verse
శిరస్సై క్రీస్తు సంఘము నడుపా సంఘ క్షేమం సాధ్యం
సంగమునందు అవయవములై సహకరించుచు సాగెదం
సార్వత్రికా సంఘముగా
సత్య సువార్తను చాటెదమా
సత్య సువార్తను చాటెదమా‖ 2x ‖