Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema kshamalanu samapaalluga viswasame lakshyamga

ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా

Prema kshamalanu samapaalluga viswasame lakshyamga

Lyricist: Swapna Edwards
Verse
ప్రేమ క్షమలను సమపాళ్లుగా
విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా
నిజదేవుని జనాంగంగా పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము‖ 2x ‖
మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం
మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం
మేం క్రైస్తవులం పరలోక దీపికలం
మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం
మేం క్రైస్తవులం క్రైస్తవులం
Verse
మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం
మేం యేసు రక్తంతో కొనబడిన వారం
మేం సత్యమార్గంలో నడిచే వారం‖ 2x ‖
యేసు నీ జీవితమే మాకు పాఠంగా
మా బ్రతుకులకే ఒక యాగంగా
చేసుకొన్న వారమే మేము
ఏక శరీరమై ఉన్నాము‖ 2x ప్రేమ ‖
Verse
మనుషులను ప్రేమిస్తాము
దైవ ప్రేమనే ప్రకటిస్తాము
ఏ శోధనకైనా తలవంచని వారం
దేవుని చెంత మోకరించేవారం‖ 2x ‖
లోకం మమ్ములను వేధిస్తున్నా
చులకనగా చూసి నింధిస్తున్నా
బాధను సహించే వారం
మేం శత్రువునైన క్షమిస్తాము‖ 2x ‖
Verse
పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే
విగ్రహారాధన మేం చెయ్యం
ఎందుకంటే మేం క్రైస్తవులం
దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము
ఎందుకంటే మేం క్రైస్తవులం‖ ప్రేమ ‖

Related Tags

FaithLoveForgivenessChristian