Chorus
ప్రేమా మయుడా కలువరి నాధా
మరణము గెలిచిన మహనీయుడా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా‖ 2x ‖
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
ఆహ హ హల్లేలుయా ఆమేన్‖ 4x ‖
Verse
అగ్నితో దహించు అగ్నితో
నన్ను కాల్చుమో దేవా
శక్తితో పూర్ణ శక్తితో‖ 2x ‖
ఆత్మ శక్తితో నింపుమా‖ ఆహ ‖
Verse
CHRIST IS HOLY NAME‖ 4x ‖
Verse
కీర్తన దావీదు కీర్తన
నేను పాడెదన్ రాజా
ప్రార్ధన దైవ ప్రార్ధన‖ 2x ‖
యెబ్బేజు ప్రార్ధన నేర్పుమా‖ ఆహ ‖
Verse
సాక్షిగా యేసు సాక్షిగా
నన్ను వాడుకో తండ్రీ
పాత్రగా క్రీస్తు పాత్రగా‖ 2x ‖
నీ చేతి పాత్రగా చేయుమా‖ ఆహ ‖