Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Nammakamugala Paraloka Thandri

ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

Prema Nammakamugala Paraloka Thandri

Verse 1
Reference: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను John 3:16
Chorus
ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను రక్తము చిందించి
మా పాపము కడుగ సిలువపై అర్పించెను
Verse
త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను
Verse
శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా
Verse
తండ్రివలెనే ప్రేమజూపి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును
Verse
మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా
తన మహా ప్రేమ జూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను
Verse
ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే

Related Tags

WorshipLoveGod The Father