Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Shaashwatha Kaalamundunu

ప్రేమ శాశ్వత కాలముండును

Prema Shaashwatha Kaalamundunu

Lyricist: K Prabhudas
Verse
ప్రేమ శాశ్వత కాలముండును
ప్రేమ అన్నిటిలో శ్రేష్టము‖ 2x ‖
ప్రేమ విలువను సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె‖ 2x ‖
ప్రేమ చూపు నరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా‖ ప్రేమ ‖
Verse
ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళుత్వము‖ 2x ‖
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా‖ ప్రేమ ‖
Verse
ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు‖ 2x ‖
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండు ప్రియుడా‖ ప్రేమ ‖
Verse
ప్రేమించు సహోదరుని
ప్రార్ధించు శత్రువుకై‖ 2x ‖
ప్రేమ యేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా‖ ప్రేమ ‖
Verse
ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును‖ 2x ‖
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా‖ ప్రేమ ‖
Verse
విశ్వాసము నిరీక్షణ
ప్రేమ ఈ మూడు నిలచున్‖ 2x ‖
వీటిలో శ్రేష్టమైనది
ప్రేమ యే ప్రేమ‖ ప్రేమ ‖

Related Tags

DevotionalChristian LifeLove