Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Yesuni Prema

ప్రేమ యేసుని ప్రేమ

Prema Yesuni Prema

Verse
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
Verse
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ‖ ప్రేమ ‖
Verse
తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును‖ ఎన్నడెన్నడు ‖

Related Tags

PraiseJesus Love