Verse
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువియందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ‖ ప్రేమ ‖
Verse
తల్లిదండ్రుల ప్రేమనీడ వలే గతియించును
కన్నబిడ్డల ప్రేమకలలా కరిగిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
భార్య భర్తల మధ్యవికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలోమోడులా మిగిలిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
బంధుమిత్రుల యందువెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమువెలుగు నిచ్చి ఆరిపోవును‖ ఎన్నడెన్నడు ‖