Verse
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ‖ ఎన్నడెన్నడు ‖
Verse
తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ
నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును‖ ఎన్నడెన్నడు ‖
Verse
ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును‖ ఎన్నడెన్నడు ‖