Verse
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను‖ 2x ‖
నే పాడెదన్ – కొనియాడెదన్‖ 3x ‖
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును‖ 4x ప్రేమా ‖
Verse
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ‖ 2x ‖
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా‖ 2x ‖
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ –‖ 2x ప్రేమా ‖
Verse
మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ‖ 2x ‖
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే‖ 2x ‖
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ –‖ 2x ప్రేమా ‖