Verse
ప్రేమడంకా జగమున - వినబడు నాదము
నీమముగా ప్రభు సిలువచే
Verse
మృత హృదయులకు జీవము నిడెను
ఆత్మల నమ్మికను రంజిల్ల జేసెను
జనుల యందు అద్భుతముల జేసెను
మన సిల్వ మిత్రుడు శ్రీయేసు
Verse
సిలువ యందున శ్రీ యేసు ప్రాణమిడెన్
చెలువుగ మన శ్రమలను పార ద్రోలెన్
తన ప్రేమ పాత్రను మనకిచ్చెను
మన సిల్వ మిత్రుడు శ్రీయేసు
Verse
కబోధులకు కన్నుల నిచ్చెను
కాళ్ళనిచ్చెను కుంటివారలకు
కొరతలేని దర్శనము మనకిచ్చెను
కొట్టబడిన మిత్రుడు శ్రీయేసు
Verse
ఇలను నిద్రమత్తున నుండి సోమరుని
కాలము వ్యర్థపరచెడు సుఖజీవిని
పుడమిలో యేసు క్రీస్తు గరుణించెను
దొడ్డ విలువ మిత్రుడు శ్రీయేసు
Verse
ప్రేమతోడ నెల్లరను పిలుచునెపుడు
సోమరులను దేశదిమ్మరులను
ధరణి జనులను చూచి మరలుటకు
కరుణించెను మిత్రుడు శ్రీయేసు